రెండు రోజులు వైన్స్, బార్లు బంద్

రెండు రోజులు వైన్స్, బార్లు  బంద్

హైదరాబాద్లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్  29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

Also Read :- రాచకొండ పరిధిలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం..

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వైన్స్ షాపులు సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో బంద్ కానున్నాయి. అయితే వైన్స్ షాపులు మాత్రమే మూతపడనున్నాయి. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు రోజుల పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు, బార్లను మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.