
రంగుల పండగ హోలీ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సీపీ అంజనీకుమార్ ఓ ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు.సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసె న్స్ చేయొద్దని సూచించారు. బుధవారం ఉదయం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటా యని సీపీ పేర్కొన్నారు.20న సాయంత్రం 6 నుంచి 22 వ తేదీ ఉదయం 6 గంటల వరకు జంట నగరాల్లోని బార్లు, వైన్స్, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించారు.