చలివేళ ఆరోగ్యం జాగ్రత్త!

చలివేళ ఆరోగ్యం జాగ్రత్త!

చలికాలంలో పొద్దున్నే తొందరగా లేవబుద్ధి కాదు. చల్లగా ఉందని చాలామంది ఎక్సర్​సైజ్​ చేయడానికి బద్ధకిస్తారు. ఈ సీజన్​లో ఎక్కువసేపు ఇంట్లోనే ఉండడం, ఎండ తగలకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు, కొలెస్ట్రాల్​ లెవల్స్​లో హెచ్చు తగ్గులు ఏర్పడి డయాబెటిస్, గుండెజబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు ఇంటర్నల్​ మెడిసిన్​ ఎక్స్​పర్ట్ సందీప్​ పాటిల్​. వింటర్​లో హెల్దీగా ఉండేందుకు ఆయన చెప్తున్న జాగ్రత్తలు కొన్ని...ఈ సీజన్​లో గింజధాన్యాలు, చిక్కుడుజాతి గింజలు, నట్స్, సీడ్స్​, పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి. విటమిన్​–సి ఉండే నిమ్మ, బత్తాయి వంటి పండ్లు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు ఎక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్​ తక్కువ తినాలి. 

ఎండ తక్కువ ఉండడం, తేమ వాతావరణం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దాంతో సీజనల్​ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్​ ఉంది. కాబట్టి వంట్లో ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా వెంటనే డాక్టర్​ని కలవాలి.ఎండలో రోజూ కొంచెం సేపు యోగ, వాకింగ్​, జాగింగ్ వంటివి చేస్తే శరీరం వెచ్చగా ఉంటుంది. వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్​ వేసుకోవాలి. చల్లని వాతావరణంలో బయటికి వెళ్లేటప్పుడు చేతులను కప్పే బట్టలు వేసుకోవాలి. చేతులకి గ్లోవ్స్, కాళ్లకు సాక్సులు, స్వెటర్​ తప్పనిసరి. 
తలకి స్కార్ఫ్​ లేదా టోపీ పెట్టుకోవాలి.