Good Health: శీతాకాలం ఇవి తింటే.. అస్సలు బరువు పెరగరు.. ఆరోగ్యంగా ఉంటారు!

Good Health:  శీతాకాలం ఇవి తింటే.. అస్సలు బరువు పెరగరు.. ఆరోగ్యంగా ఉంటారు!

చలికాలంలో బరువు పెరుగుతారని తెలిసే ఉంటుంది. అలాగెందుకంటే... మీకు తెలియందేముంది... చలిపులి బెడ్ మీద నుంచి అడుగు కిందకు పెట్టనీయదు. వెచ్చగా దుప్పట్లో ముడుచుకుని పడుకోమంటుంది. అందుకని చాలామంది రె గ్యులర్​ గా  చేసే వ్యాయామాలకు బ్రేక్ ఇస్తారు. అలాగని తిండి విషయంలో జాగ్రత్త వహించరు. ఇంకేముంది బరువు పెరిగిపోతా రు. అలాకాకుండా ఉండాలంటే తిండి విషయంలో కొన్ని జాగ్రత్త లు పాటించాలి.

 ఆలుగడ్డ తినాలి. అదేంటి ఇది తింటే లావు పెరుగుతారు కదా! రివర్స్లో చెప్తున్నారేంటి అనిపిస్తుంది. కానీ కాలిఫో ర్నియా యూనివర్శిటీ వాళ్లుఆలుగడ్డ తినడం వల్ల బరువు పెరగరు అని వెల్లడించింది. అంతేకాదు ఆరోగ్యకర కేలరీ లను శరీరానికి అందిస్తుందని చెప్పారు వాళ్లు.

 ఒక కప్పు క్యాలీఫ్లవర్​ తో  29 కెలొరీలు వస్తాయి. అంతేకాకుండా కేన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.  ఇది తింటే బరువు పెరగరు కూడా. అందుకని చలికాలంలో క్యాలీఫ్లవర్ తిని బరువును అదుపు చేసుకోండి.

 క్యారెట్ తింటే మీ నడుము చుట్టు కొలత పెరగకుండా ఉంటుంది. నాన్​ వెజ్ ప్రియు లైతే కనుక మాంసంతో పాటు కాల్చిన క్యారెట్ ముక్కలు కూడా తినాలి. ఇలా తినడం విల్ల కెలొరీల సంఖ్య తగ్గుతుం ది. ఎక్కువ సమయం పొట్ట నిండుగా అనిపిస్తుంది.