చలికాలం కొనసాగుతుంది. జనాలు గజ గజ వణుకుతున్నారు. చల్లగా ఉండి ఏదీ తినలేకపోతున్నాము.. తినకపోతే నీరసం మామూలే కదా..! చలికాలంలో వేడిగా కొన్ని స్పైసీ ఫుడ్ లను తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు. తింటే ఎంతో హాయిగా.. ఉండే ముల్లంగి కోఫ్తా..బీట్ రూట్ కబాబ్ లను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
ముల్లంగి కోఫ్తా తయారీకి కావలసినవి
- ముల్లంగి–అరకిలో
- కొబ్బరి తురుము– ఒక టేబుల్ స్పూన్
- పల్లీలె – అర టేబుల్ స్పూన్
- గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి–రెండు
- పచ్చిమిర్చి – ఒకటి
- ఉల్లిపాయ ఒకటి
- కొత్తిమీర– ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు – సరిపడ
- నూనె– వేగించడానికి సరిపడ
గ్రేవీ కోసం
- ఎండుమిర్చి–నాలుగు
- వెల్లుల్లి పేస్ట్– ఒక టీ స్పూన్
- ధనియాల పొడి– ఒక టీ స్పూన్
- పసుపు - అర టీస్పూన్
- ఉల్లిపాయలు -మూడు తరిగి)
- ఉల్లిపాయ - ఒకటి (పేస్ట్ చేసి)
- నూనె - వంద మిల్లి లీటర్లు
- పెరుగు - ఒక కప్పు
- గరం మసాలా - ఒక టీస్పూన్
- ఆకు పచ్చ యాలక్కాయలు నాలుగు
- తయారీ విధానం: ముల్లంగిని చిన్నమొక్కలుగా తరగాలి.
- మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. నీళ్లు వంపేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- కొబ్బరి, పల్లీలు, శెనగపిండి, గరం మసాలా. కారంలను కలిపి గ్రైండ్ చేయాలి.
- పచ్చిమిర్చి ఉల్లిపాయలు, కొత్తిమీరలను తరగాలి.
- ఉడికించిన ముల్లంగిలో ఇవన్నీ వేసి, ఉప్పు కూడా వేసి కలపాలి.
- చిన్న ఉండలుగా చేయాలి నూనెలో ఉండలు రంగు మారేవరకు వేగించి టిష్యూ పేపర్ మీద వేస్తే నూనె పీల్చేస్తుంది పేపర్.
గ్రేవీ కోసం
- ఎండు మిర్చి, ఉప్పు, వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపులను వేడి నూనెలో వేసి రంగు మారే వరకు వేగించాలి.
- ఉల్లి తరుగు, ఉల్లి ముద్దలను వేసి ఐదు నిమిషాలు వేగించాలి.
- వీటిని పెరుగులో వేయాలి తరువాత గరం మసాలా, యాలక్కాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్క వేయాలి.
- ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసి మూడు నిమిషాలు ఉడికించాలి.
- ఇందులో ముందు తయారుచేసుకున్న కోఫ్తాలు వేసి కాసేపు ఉడికించాలి. వేడి వేడిగా తింటే యమ్మీగా ఉంటాయి.
బీట్ రూట్ కబాబ్ తయారీకి కావలసినవి
- బీట్ రూట్ తురుము - ఒక కప్పు
- గట్టి టోపు సగం ప్యాకెట్
- వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్
- వేగించి పొడి చేసిన దానిమ్మ గింజలు - ఒక టేబుల్ స్పూన్
- ఛాట్ మసాలా-చిటెకెడు
- కళ్లు ఉప్పు- రుచికి సరిపడా.
- జీడిపప్పు పలుకులు - పావు కప్పు
- కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన ఓట్స్ - అర కప్పు
- నూనె - వేగించడానికి సరిపడా
తయారీ విధానం: ఒక గిన్నెలో బీట్ రూట్ తురుము, టోపు, వె ల్లుల్లి పేస్ట్, ఆమ్ చూర్, చాట్ మసాలా, కళ్లు ఉప్పు, దానిమ్మ గింజల పొడి వేసి కలపాలి. గుండ్రంగా ప్యాటీల్లా వత్తి వీటిలో జీడిపప్పు
పలుకులు ఫిల్లింగ్ పెట్టాలి. వీటిని గుండ్రటి కెబాబ్ ల్లా చేయాలి.ప్యాటీలను ఓట్స్ పొడిలో దొర్లించాలి. లోతులేని ప్యాన్ మీద నూనె వేడిచేయాలి. దోరగా వేగించాలి.వీటిని గ్రీన్ చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. .
