డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు స్టార్ట్

డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు స్టార్ట్

ఢిల్లీ:  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నిర్వహణపై రేపు అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపునిచ్చింది. సమావేశానికి రావాలంటూ పార్టీలను ఆహ్వానించింది. ఈ సెషన్‌లో పలు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి  రోజే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం విశేషం. ఈసారి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 37 బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. కొత్తగా మరో 7 బిల్లులను ప్రవేశపెట్టబోతోంది.