విప్రో చేతికి ఫిలిప్పీన్స్‌ కంపెనీ

విప్రో చేతికి ఫిలిప్పీన్స్‌ కంపెనీ

బెంగళూరు: ఫిలిప్పీన్స్‌ కు చెందిన పర్సనల్‌ కేర్‌ కంపెనీ స్ప్లాష్‌ కార్పొరేషన్‌‌‌‌ను కొనడానికి ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో సోమవారం ప్రకటించింది. అయితే ఈ డీల్‌ విలువను మాత్రం వెల్లడించలేదు. ఈ కంపెనీని దక్కించుకోవడం వల్ల పర్సనల్‌ కేర్‌ లోని కన్సూమర్‌ కేర్‌ పోర్ట్‌‌‌‌ఫోలియో మరింత బలోపేతమవుతుంది. ఆగ్నేయ ఆసియాలో అడుగుపెట్టినట్టు అవుతుంది.కన్సూమర్‌ కేర్‌ లైన్‌‌‌‌ వ్యాపారంలో విప్రోకు ఇది 11వ కొనుగోలు అవుతుంది. పర్సనల్‌ కేర్‌ విభాగంలో తొమ్మిదో విలీనం అవుతుంది.

కన్సూమర్‌ లైన్‌‌‌‌ బిజినెస్‌ కోసం విప్రో ఇండియాలోనే ఐదు కంపెనీలను కొన్నది. విదేశీ కంపెనీల విషయానికి వస్తే ఇంగ్లండ్‌ కు చెందిన యార్డ్‌ లే, సింగపూర్‌ కు చెందిన ఎల్డీ వాక్సన్‌‌‌‌, చైనాకు చెందిన జోంగ్‌ షాన్‌‌‌‌ కంపెనీలను కొనేసింది. కన్సూమర్‌ ప్రొడక్స్‌ట్ సంస్థ హ్యాప్పిలీ అన్‌‌‌‌మ్యారీడ్‌ లో మైనారిటీ వాటా దక్కించుకుంది. స్ప్లాష్‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ నెట్‌ వర్క్‌‌‌‌ ద్వారా ఫిలిప్పీన్స్‌ లో విప్రో వస్తువులు అమ్ము-తామని, స్ప్లాష్‌ వస్తువులను ఇతర దేశాల మార్కెట్లకు తీసుకెళ్తామని విప్రో కన్సూమర్‌ కేర్‌ ఉన్నతాధికారి నాగేందర్‌ ఆర్య తెలిపారు.మనదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే సంతూర్‌ , చంద్రిక, గ్లూ కోవిటా, నార్త్‌‌‌‌వెస్ట్‌‌‌‌, విప్రో స్మార్ట్‌‌‌‌లైట్‌ వంటి బ్రాండ్లు తమ కంపెనీవేనని ఆర్య చెప్పా రు.