45కి చేరిన ఒమిక్రాన్ కేసులు

45కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 45 కి చేరింది. గుజరాత్ కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి  డిసెంబర్ 3న కెన్యా, అబుదాబీ మీదుగా సౌతాఫ్రికా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. డిసెంబర్ 3, 4వ తేదీల్లో ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయగా రెండుసార్లు నెగిటివ్ వచ్చింది. ఐసోలేషన్ లో ఉన్న ఆయనకు డిసెంబర్ 8న మరోసారి పరీక్ష నిర్వహించగా కోవిడ్ ఒమ్రికాన్ సోకినట్లు తేలింది. బాధితుడి శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన అధికారులు ప్రస్తుతం అతనికి ఇంట్లోనే ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 
దేశంలో ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర - 20, రాజస్థాన్ -09, కర్నాటక 03, గుజరాత్ -04, కేరళ -01, ఏపీ -01 కేసులు నమోదుకాగా.. ఢిల్లీలో -06, చండీఘడ్ లో ఒకరు కొత్త వేరియెంట్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 5,784 మంది కరోనా బారిన పడగా.. మొత్తం కేసుల సంఖ్య 3,47,06,344కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 88,993కు తగ్గింది. ఒమిక్రాన్ బారిన పడి ఇప్పటి వరకు యూకేలో ఒకరు మృతి చెందారు.