నిద్ర గురించి మరో ఇంట్రెస్టింగ్​ స్టడీ

నిద్ర గురించి మరో ఇంట్రెస్టింగ్​ స్టడీ

పిల్లలకైనా, పెద్దలకైనా నిద్ర చాలా అవసరం. ఏ ఏజ్​ వాళ్లు ఎన్ని గంటలు నిద్ర పోవాలో కూడా కొన్ని స్టడీలు చెప్పాయి. అంతేకాకుండా ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం వల్ల కలిగే లాభనష్టాలు అప్పుడప్పుడు చర్చకు వస్తుంటాయి. లేటెస్ట్​గా నిద్ర గురించి మరో ఇంట్రెస్టింగ్​ స్టడీ జరిగింది.

పిల్లలు నిద్రపోయేటప్పుడు కొన్ని ఎక్స్​ప్రెషన్స్​ పెడతారు. ఆ ఎక్స్​ప్రెషన్స్​ను బట్టి ఫ్యూచర్​లో వాళ్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్​ వస్తాయి? వాటిని వాళ్లెలా డీల్ చేస్తారు? అనేది తెలుసుకోవచ్చట. ఈ విషయం ‘హూస్టన్ యూనివర్సిటీ’ చేసిన స్టడీలో తేలింది. ఏడు నుంచి పదకొండేండ్లున్న 37మంది పిల్లలపై ఈ స్టడీ చేశారు. ఈ 37 మందిలో కొంతమంది అంతకుముందు రోజున హాయిగా నిద్రపోయినవాళ్లు, కొంతమంది సరిగా నిద్రపోని వాళ్లు. వీళ్లకు రెండు రకాల ఫొటోలు చూపించారు. ఐస్​క్రీమ్​, పెట్​ యానిమల్స్​ లాంటి ఫొటోలు కొన్ని, ఇంజెక్షన్ చేయించుకుంటున్నట్టు, కుక్కల మీద పడుతున్నట్టు ఉన్న ఫొటోలు కొన్ని చూపించారు. బాగా నిద్రపోయినవాళ్లు ఈ రెండు రకాల ఫొటోలు చూసి మామూలుగానే రియాక్ట్​ అయితే, సరిగ్గా నిద్రపోని పిల్లల రియాక్షన్​లో బెదురు, ఆందోళన కనిపించాయి. పిల్లలు పెరిగిన పరిసరాలు, వాళ్ల ఫ్యామిలీ పరిస్థితులను బట్టి కూడా మొహాల్లో తేడాలు కనిపించాయట.

ఈ రెండు రకాల ఫొటోలను చూపిస్తూ పిల్లల ఫేస్​ ఎక్స్​ప్రెషన్స్​ కెమెరాలో రికార్డ్ చేయమని పేరెంట్స్​కు చెప్పారు రీసెర్చర్లు. దాంతో రెండేండ్ల పాటు పిల్లల్ని అబ్జర్వ్​ చేస్తూ, వీడియో రికార్డు చేశారు పేరెంట్స్. ఆ తరువాత వాళ్లు ఎలాంటి ప్రాబ్లమ్స్​ ఎదుర్కొన్నారు? అనేది గమనించారు. ఆ రిపోర్ట్స్ చూస్తే ‘మేము​ అనుమానించినట్లే జరిగిందని’ రీసెర్చర్స్​ చెప్పారు. పాజిటివ్​ ఫొటోలను చూపించినప్పుడు ప్రశాంతంగా నిద్రపోయారు. అదే భయపెట్టే ఫొటోలను చూసిన పిల్లల్లో నిద్ర తక్కువైంది. దాంతో వాళ్ల మైండ్ మీద ఎఫెక్ట్ పడింది. ఈ పిల్లలు ఫ్రెండ్స్​తో ఆడుకునేటప్పుడు గొడవలు పడేవాళ్లని, రిలేటివ్స్​తో మాట్లాడేటప్పుడు కోపంగా ఉండేవాళ్లని తెలిసింది. దీనిద్వారా నిద్ర తక్కువైతే  బ్రెయిన్​ పని తీరులో వచ్చే మార్పుల గురించి తెలిసిందన్నారు రీసెర్చర్స్​.