తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఎ ఆర్ సజీవ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’. మలయాళ చిత్రం ‘జయ జయ జయహే’కు ఇది తెలుగు రీమేక్. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి కలిసి నిర్మిస్తున్నారు. జనవరి 23న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
సోమవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్ మాట్లా డుతూ ‘ఇది నాకు ప్యాషనేట్ ప్రాజెక్టు. చాలామందికి ఇది రీమేక్ కదా మళ్లీ ఎందుకు చూడాలనే అభిప్రాయం ఉంది. సోల్ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దీన్ని రూపొందించాం. గోదారి యాస, అక్కడి కల్చర్‌కి ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఇందులో తన రోల్ అందరి నీ అలరిస్తుందని ఈషా రెబ్బా చెప్పింది.
ఈ చిత్రం తప్ప కుండా ప్రతి ఒక్కర్నీ ఎంటర్‌టైన్ చేస్తుందని నటుడు బ్రహ్మాజీ, దర్శకుడు సజీవ్ అన్నారు. ఇది రీమేక్‌లా కాకుండా చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుందని నిర్మాత సృజన్ చెప్పారు.
