ఆఫీసులకు సార్లు పోతలె

ఆఫీసులకు సార్లు పోతలె

తహసీల్దార్​ ఆఫీస్​ నుంచి సెక్రటేరియట్​ దాకా అంతే
కొన్ని ఆఫీసుల్లో రోజు విడిచి రోజు డ్యూటీలు

హైదరాబాద్​, వెలుగు: కరోనా ఎఫెక్ట్​తో గవర్నమెంట్​ ఆఫీసులు బోసిపోతున్నాయి. తహసీల్దార్​​ఆఫీసు నుంచి బీఆర్కే (సెక్రటేరియట్​) భవన్​ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి ఆఫీసులోనూ సిబ్బంది, అధికారులకు కరోనా సోకడంతో 55 ఏండ్లు నిండిన ఉద్యోగులు.. ఆఫీసుకు రావాలంటేనే జంకుతున్నారు. కరోనా కేసులు పెరిగిపోతుండడంతో సీఎంవో, బీఆర్కే భవన్​, వివిధ శాఖల కమిషనరేట్లు, 33 జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్​, జెడ్పీ, ఎంపీడీవో ఆఫీసుల్లో డ్యూటీకి వచ్చే ఉద్యోగుల సంఖ్య  సగానికి పడిపోయింది. ప్రజల నుంచి సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులనూ నేరుగా తీసుకోవట్లేదు. ఫిర్యాదుల బాక్స్​లో వేస్తే మూడు నాలుగు రోజుల తర్వాత వాటిని పరిశీలిస్తున్నారు  
భయపెడుతున్న కేసులు, మరణాలు.. 
బీఆర్కే భవన్​లో 70 మంది దాకా కరోనా బారినపడ్డారు. సీఎస్​ పేషీలో పని చేసేవారే 8 మంది ఉన్నారు. ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​లో పని చేస్తున్న ఓ అసిస్టెంట్​ సెక్రటరీ, ఓ రికార్డ్​ అసిస్టెంట్​ చనిపోయారు. ఎంప్లాయ్​ భర్త కరోనాతో చనిపోవడంతో హయ్యర్​ ఎడ్యుకేషన్​కౌన్సిల్​ను బంద్​పెట్టారు. స్కూల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ శ్రీదేవసేనతో పాటు డైరెక్టరేట్​లోని ఎనిమిది మంది ఆఫీసర్లు కరోనా బారిన పడడ్ఆరు. ఇంటర్​ బోర్డులో 10 మందికి పాజిటివ్​ వచ్చింది. టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​​ఆఫీసులో 50 మంది ఉద్యోగులు ఉంటే 12 మందికి పాజిటివ్​ వచ్చింది. పోలీస్​ డిపార్ట్​మెంట్​లో 2 వేల మందికిపైగా పోలీసులు కరోనా బారినపడ్డారు. సీసీఎల్​ఏ ఆఫీసులో 15 మంది దాకా కరోనా బారిపడ్డారు. రాష్ట్రమంతటా 10 మందిదాకా రెవెన్యూ ఉద్యోగులు కరోనాతో చనిపోయారు. నారాయణపేట జిల్లా కలెక్టరేట్​లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్​​నారాయణ రావు, కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల తహసీల్దార్​ ఆఫీసులో పని చేస్తున్న జూనియర్​ అసిస్టెంట్​ విజయ, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన వీఆర్వో వెంకటేశ్​​కరోనా సోకి చనిపోయారు. నిర్మల్​ జిల్లాలో ఎంఈవో, ఓయూ సీఎఫ్​ఆర్డీ డైరెక్టర్​ప్రొఫెసర్​ రెహ్మాన్​లు కరోనాతో చనిపోయారు. 
భయం భయంగా డ్యూటీలకు  
ఆఫీసుల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ఉద్యోగులు.. భయంభయంగానే డ్యూటీలకు వస్తున్నారు. షుగర్​, బీపీ, ఇతర జబ్బులతో బాధపడుతున్నవారు సెలవులు పెడుతున్నారు. వీరిలో 80 శాతం మంది వ్యాక్సిన్​ ఫస్ట్​, సెకండ్​ డోస్ ​​వేయించుకున్నా డ్యూటీలకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో చాలా ఆఫీసుల్లో అనధికారికంగానే రోజు విడిచి రోజు డ్యూటీలు వేస్తున్నారు.