నిజాం కాలేజీ హాస్టల్ ఇష్యూపై మంత్రి సబిత రివ్యూ

నిజాం కాలేజీ హాస్టల్ ఇష్యూపై మంత్రి సబిత రివ్యూ

హైదరాబాద్, వెలుగు: నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్​తో అధికార యంత్రాంగంలో చలనం మొదలైంది. బుధవారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ రవీందర్​తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. డిగ్రీ స్టూడెంట్లకు హాస్టల్ ​వసతి ఇవ్వొచ్చా.. లేదా, ఒక వేళ ఇచ్చే అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయం ఏంటీ అనే అంశాలపై చర్చించారు. స్టూడెంట్ల డిమాండ్లు, ఇతర సమస్యలపై గురువారం వారితో మాట్లాడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో గురువారం మధ్యాహ్నం స్టూడెంట్ల ప్రతినిధులతో నవీన్ మిట్టల్, రవీందర్, కాలేజీ ప్రిన్సిపల్ సమావేశం కానున్నారు.