TS ఐపాస్ తో 15రోజుల్లోనే 17500 కంపెనీలకు అనుమతి

TS ఐపాస్ తో 15రోజుల్లోనే 17500 కంపెనీలకు  అనుమతి
  • పరిశ్రమలు స్థాపించే వారి కోసం రాష్ట్రంలో 2వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్: TS ఐపాస్ తో 17 వేల 500 కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చామన్నారు మంత్రి కేటీఆర్. పెట్టుబడులు పెట్టే వారి కష్టాలు తమకు తెలుసన్నారు. అందుకే ఎలాంటి కష్టాలు ఉండకూడదని TS ఐపాస్ ని మొదలు పెట్టామని ఆయన వివరించారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ లో జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. జర్మనీ పారిశ్రామిక వేత్తలని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం 2 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉందన్నారు కేటీఆర్. పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ రూపొందించిన విధి విధానాలు బాగున్నాయని, జర్మనీ ప్రభుత్వం, అక్కడి పారిశ్రామిక వేత్తలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జర్మనీ దేశం జీడీపీ అభివృద్ధికి చిన్న పరిశ్రమలో సహకరిస్తున్నాయని తెలిపారు. 
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే సింగిల్ విండో విధానం ద్వారా 15 రోజుల్లోనే అనుమతి ఇస్తామని, అమెరికాలో కూడా టీఎస్ ఐ పాస్ లాంటి చట్టం లేదన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందుబాటులో ఉందని మంత్రి కేటీఆర్ వివరించారు.