జవాబు కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి?

జవాబు కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మన్ కీ బాత్‌‌లో మాట్లాడనున్న ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ మండిపడ్డారు. ‘ఇది సమర్థించాల్సిన ప్రశ్న, కానీ ప్రభుత్వ జవాబు కోసం భారత్ ఇంకెన్నాళ్లు వేచి చూడాలి? మన్ కీ బాత్‌‌లో కరోనాను నియంత్రించే వ్యూహం గురించి ప్రధాని మాట్లాడతారని ఆశిస్తున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌‌కు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన ఆర్టికల్‌‌ను ఆయన జత చేశారు. ఆ ఆర్టికల్‌‌లో సీరం ఇన్‌‌స్టిట్యూట్ అధినేత పూనమ్‌‌వల్లా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ప్రతి భారతీయుడికి వ్యాక్సినేషన్ చేయడానికి రూ. 80 వేల కోట్లు అవసరం అవుతుందని, అంత మొత్తం కేంద్రం వద్ద సిద్ధంగా ఉందని ప్రశ్నించారు.