రెబల్స్ విత్ డ్రా చేసుకునేలా చూడండి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రెబల్స్ విత్ డ్రా చేసుకునేలా చూడండి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     నామినేషన్ వెనక్కి తీసుకుంటే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తాం:మహేశ్ ​గౌడ్

హైదరాబాద్, వెలుగు: రెబల్స్ నామినేషన్​విత్​డ్రా చేసుకునేలా చూడాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. నామినేషన్​ఉపసంహరించుకున్న వారికి భవిష్యత్తులో పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. శనివారం గాంధీ భవన్​లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. 

నియోజకవర్గ ఇన్​చార్జి, మంత్రి అజారుద్దీన్ తోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే అంశంపై చర్చించారు. 

రెబల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎన్నికల బరి నుంచి తప్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బీ ఫామ్ పొందినవారు తప్ప మిగతా వారు నామినేషన్​ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్​సూచించారు. పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, రెండేండ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు.