ఈ ఎలుగు బంటి ఓ జవాన్‌

ఈ ఎలుగు బంటి ఓ జవాన్‌

అడవుల్లో తిరగాల్సిన గుడ్డేలుగు సైన్యంలో చేరింది. ట్రైనింగ్ తీసుకుని సోల్జర్​గా మారింది. యుద్ధంలో కూడా పార్టిసిపేట్​ చేసింది. రెండో ప్రపంచ యుద్ధమప్పుడు పోలాండ్ దేశ ఆర్మీలో పనిచేసింది. ఆ గుడ్డేలుగు చేసిన సేవలకు గాను, చాలా చోట్ల  దాని విగ్రహాలు వెలిశాయి. గుడ్డేలుగు ఏంటి? సైన్యంలో పని చేయడం ఏంటి అనిపిస్తుంది కదా! నిజంగా చాలా గ్రేట్​ అది.

జంతువులు, పక్షులు మనుషులతో సావాసం చేయడం ఎప్పట్నించో చూస్తున్నదే. పిల్లి, కోతి, కుక్క, మేక, గేదె, గుర్రం, చిలుక, పావురం, కోడి వంటి చాలా జంతువులు మనుషులతోనే కలిసి జీవిస్తున్నాయి.​ నిజానికి అవి మన మీద డిపెండ్​ అయ్యి బతుకుతుంటే, మనిషేమో వాటి మీద డిపెండ్ అయ్యి బతుకు ఈడుస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు డెబ్భై ఏళ్ల క్రితం ఒక గుడ్డేలుగు కూడా మనుషులతో ఫ్రెండ్​షిప్​ చేసింది. అది కూడా ఆర్మీలో ఉండే సైనికులతో. మామూలుగా ఏ జంతువైనా మనుషులతో కలిసి ఉంటే, వాళ్లు చేసేవన్నీ గమనించి ఇమిటేట్​ చేస్తుంటుంది. సోల్జర్స్​ అంటే వార్​ కోసం రెడీ అవుతుంటారు. కంటిన్యూస్​గా కసరత్తులు చేస్తుంటారు. అందుకని వాళ్లతో ఫ్రెండ్​షిప్​ చేసి గుడ్డేలుగు కూడా సోల్జర్​గా మారిపోయింది కాబోలు అనుకుంటున్నారా! అవును, అక్షరాల అదే నిజం. అనుకోని ఇన్సిడెంట్స్​ వల్ల అనాథగా మారిన ఒక సిరియన్​ బ్రౌన్ బేబీ బేర్​ ​స్టోరీ ఇది.

అసలేం జరిగిందంటే...

అది 1942. రెండో ప్రపంచయుద్ధం నాటి కాలం. ఇరాన్​లోని హమదాన్​ రైల్​రోడ్ స్టేషన్​ దగ్గర్లో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఒక గుడ్డేలుగు చనిపోయింది. అక్కడ దాని పిల్ల గుడ్డేలుగు కూడా ఉంది. తల్లి ప్రాణాలు పోయాక పిల్ల గుడ్డేలుగు అనాథ అయ్యింది. 1942, ఏప్రిల్ 8న ఇరానియన్​ పిల్లాడు ఆ పిల్ల గుడ్డేలుగుతో  ఆడుకోవడం పోలెండ్ సోల్జర్స్​ చూశారు. పిల్లాడు ఏం చెబితే ఆ గుడ్డేలుగు అదే చేస్తుంటుంది. అదలా చేయడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. పిల్లాడికి చెప్పి, ఆ బేబీ బేర్​ని తమతో తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత వాళ్ల జనరల్​ మనవరాలు ఇరేనా కొన్ని రోజులు ఆ బేబీ బేర్​ని పెంచుకుంది. 1942, ఆగస్ట్​లో ఇరేనా సెకండ్​ ట్రాన్స్​పోర్ట్ కాంబ్​ యూనిట్​కి ఆ గుడ్డేలుగుని డొనేట్​ చేసింది. తర్వాతి కాలంలో  ఈ యూనిట్ 27 ఆర్టిలరీ యూనిట్​గా పాపులర్​ అయింది. అక్కడి సోల్జర్స్​ దానికి ‘వాయ్​టెక్’ అని పేరు పెట్టారు. వాయ్​టెక్ అంటే వాళ్ల భాషలో ‘హ్యాపీ సోల్జర్​’ అని అర్థం. కొద్దిరోజుల్లోనే వాయ్​టెక్​ పోలాండ్ సోల్జర్స్​కి మంచి ఫ్రెండ్ అయ్యింది. మొదట్లో దానికి బీర్​ బాటిల్​తో పాలు పట్టేవాళ్లు సోల్జర్స్​. తేనె కూడా ఇచ్చేవాళ్లు.  అప్పుడప్పుడూ వోడ్కా కూడా తాగించేవాళ్లు. అయితే బేబీ బేర్​ పాలు, తేనె కంటే బీర్​, వోడ్కాలు​ తాగడాన్నే ఎక్కువ ఇష్టపడేదట.​ పాలను కూడా వొడ్కా బాటిల్​లో పోసి ఇస్తేనే తాగేదట. బాటిల్​ ఖాళీ అయిపోతే, అందులో ఇంకా ఏమైనా మిగిలి ఉందేమోనని బాటిల్​ లోపలికి చూసేది వాయ్​టెక్. సోల్జర్స్​ కూడా దాన్ని చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకునేవాళ్లు. సిగరెట్ తాగి, పొగ వాళ్లమీదకు ఊదడం, కుస్తీ పట్టడం వంటివి ఇమిటేట్ చేసేది వాయ్​టెక్. ఫ్రెష్​ ఫ్రూట్ జ్యూస్​లు తాగడం కూడా వాయ్​టెక్​కి చాలా ఇష్టమట. గుడ్డేలుగు లైఫ్​ ఆరెంజ్​లు విసిరేస్తూ గ్రెనేడ్​ విసరడాన్ని  ప్రాక్టీస్​ చేయించేవారట. గుడిసెల్లోకి వెళ్లి తనంతట తానుగా స్నానం చేయడం నేర్చుకుందట. మాంటే కాస్సినోలో యుద్ధం జరిగేటప్పుడు గన్స్​ని లోడ్ చేయడానికి కావాల్సిన మందుగుండు సామాగ్రి పట్టుకుని ఫ్రంట్ లైన్​ వారియర్​గా నిలుచునేది వాయ్​టెక్​. సోల్జర్స్​తో కలిసి నిద్రపోయేది. వార్​ వెపన్స్​ ఉన్న బాక్స్​లను ఈజీగా మోసేది. సోల్జర్స్​ చేసే ప్రతి పనినీ, వాయ్​టెక్​ కూడా చేసేది. ఒకసారి బ్రిటిష్ సోల్జర్స్​తో కలిసి, ఈ 22 యూనిట్ సోల్జర్స్​ యుద్ధం చేయాల్సివచ్చింది. అందుకోసం, ఈ సైనికులంతా బ్రిటిష్​ ట్రాన్స్​పోర్ట్ షిప్​లో జర్నీ చేయాల్సి వచ్చింది. కానీ, ఈజిప్ట్ పోర్ట్​లో అక్కడి ఆఫీసర్స్​ వాయ్​టెక్​ని లోపలికి రానివ్వలేదు. కానీ, సోల్జర్స్​కి వాయ్​టెక్​ని వదిలి వెళ్లడం ఇష్టంలేక, పోలెండ్ ఆర్మీలో లీస్ట్ ర్యాంక్​ సోల్జర్​గా రిజిస్టర్ చేశారు. అలా వాయ్​టెక్​ పోలెండ్​ ఆర్మీలో అఫీషియల్ సోల్జర్​ అయ్యిందన్నమాట.

యుద్ధ రంగంలో...

1944, మాంటే కాస్సినోలో జరిగిన యుద్ధంలో ఈ సైన్యం పాల్గొంది. ఈ యుద్ధంలో వాయ్​టెక్ సోల్జర్స్​కి ఎంతో సాయం చేసింది. దాదాపు నలభై ఐదు కేజీల మందు గుండు సామాన్లు ఉన్న బాక్స్​ను ఈజీగా పట్టుకెళ్లి సైనికులకు ఇచ్చేది. పెద్ద పెద్ద రాకెట్లను కూడా మోసుకెళ్లేది. నిజానికి వీటిని ట్రక్​లో పెట్టి వార్​ జరిగే చోటుకి తీసుకెళ్లేవాళ్లు. కానీ, వాయ్​టెక్​ వాటిని మోసుకెళ్లడం వల్ల సోల్జర్స్​కి పని ఈజీ అయింది. మాంటే కాస్సినోలో 1944 , జనవరి 17 నుంచి మే 19 వరకూ అంటే దాదాపు మూడు నెలలు యుద్ధం జరిగింది. ఈ వార్​లో వాయ్​టెక్​ చేసిన సాయానికి గాను, అప్పటి వరకు తక్కువ ర్యాంక్​లో ఉన్న దాన్ని కార్పొరేట్ ట్రైనింగ్​కు ప్రమోట్​ చేశారు. దాంతో ఆ యూనిట్​కి ఎంబ్లమ్​గా వాయ్​టెక్​ ఫొటోను పెట్టుకున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక, యూనిట్​తో పాటు వాయ్​టెక్ కూడా స్కాట్లాండ్​కి వెళ్లింది. ఆ తర్వాత సోల్జర్స్​ అంతా వెళ్లిపోయారు. దాంతో 1947, నవంబర్​ 15న ఎడిన్​ బరో​ జూకి పంపించారు. అప్పటిదాకా తనతో ఉన్న సోల్జర్స్​ కనిపించక ఒంటరై పోయింది వాయ్​టెక్​. అప్పుడప్పుడూ సోల్జర్స్ దాన్ని చూసేందుకు ఆ జూకి వెళ్లేవాళ్లు. 1963, వాయ్​టెక్​కి పేగు పాడయింది. సిగరెట్లు మింగడం వల్లే అలా జరిగింది అంటారు. అదే సంవత్సరం డిసెంబర్​లో 21 ఏళ్ల వాయ్​టెక్​ కన్నుమూసింది. 

 

  • పోలాండ్​ ఆర్మీకి వాయ్​టెక్​ అందించిన సేవలకు గుర్తుగా లండన్​లోని చాలా మ్యూజియాలు వాయ్​టెక్ విగ్రహాలు పెట్టాయి. 
  • మాంటే కెస్సినో వార్​ జరిగి డెబ్భై ఏళ్లు అయిన సందర్భంగా, 2014, మే 18న పోలాండ్​లోని జోర్డాన్​ పార్క్​లో వాయ్​టెక్​ విగ్రహాన్ని పెట్టారు. 
  • 2015లో స్కాట్లాండ్​లోని ఈడెన్​ బర్గ్​లో పోలాండ్ సోల్జర్​తో వాయ్​టెక్ ఉన్న విగ్రహాన్ని పెట్టారు. ఏప్రిల్ 26, 2012లో కూడా స్కాట్లాండ్​లోని డున్స్​ సిటీలో సోల్జర్​ బేర్ విగ్రహాన్ని పెట్టారు. 
  • 1982లో ‘ది స్నోమ్యాన్’​ అనే యానిమేషన్​ డాక్యుమెంటరీ తీశారు. అది ఆస్కార్​కి నామినేట్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్​  ప్రతి క్రిస్మస్​కి బ్రిటిష్ టెలివిజన్​లో టెలికాస్ట్​ అవుతుంది.