మనం పూజ చేసే సమయంలో మనకు దొరికిన పూలను స్వామి లేదా అమ్మవార్లకు సమర్పిస్తుంటాం. మన పెరట్లో ఉన్నవో లేదా ఇంటికి దగ్గరగా ఉన్న పూలనో తీసుకొచ్చి దీపారాధన చేస్తుంటాం.. రోజు వారి పూజ చేసినా.. గుడికి వెళ్లేటప్పుడు.. సాధ్యమైనంత వరకు పూలు.. పండ్లు తీసుకెళ్తుంటాం. మనం తీసుకెళ్లే పూలతో స్వామి వారిని అర్చించి.. ప్రసాదాన్ని ఇస్తారు. అయితే ఒక్కో రకం పువ్వుతో ఒక్కో ఫలితం ఉంటుంది. మరి ఏ పువ్వు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. . .!
పూజ చేసేటప్పుడు.. దేవుడి మందిరాలను అలంకరించేటప్పుడు ఎక్కువుగా పూలను ఉపయోగిస్తుంటాం పూజలోని ప్రతి అంశం పూలతోనే ముడిపడి ఉంటుంది. రకరకాల పూలు, రకరకాల రంగుల్లో దేవుడిని అలంకరించడం, పూజించడం ఆనవాయితీగా వస్తోంది. దేవుడికి పూల పూజ విశేషాలు ఇవే..!
- జాజి పూలు: మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది . ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి
- సంపెంగ పూలు: మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు .శత్రువుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది.
- పారిజాతం : కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లబిస్తుంది
- రుద్రాక్ష పువ్వు : ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం మీదే అవుతుంది
- మొగలి పువ్వు : అధికారంలో ఉన్నవారు ఇబ్బంది పెడుతుంటే ఈ పూలతో పూజతో అధికారులు మిత్రులవుతారు.
- లక్కీ పపువ్వు: భార్య పిల్లలతో కలహాలు లేకుండ సంతోషంగా ఉంటారు
- పద్మం లేదా కమలం: సమస్త దరిద్రాలు తొలగి శ్రీమంతులు అవుతారు
- మల్లె పువ్వు: అన్ని రోగాలు నయంఅవుతాయి .ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ పూలతో పూజించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
- గన్నేరు పూల : కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.. విద్యార్థులు ఈ పూలను దేవుడికి సమర్పిస్తే విద్యలో రాణిస్తారు.
- కల్హార పుష్పం: అందరిలో గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది..
- పాటలీ పుష్పం: వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది
- కంద పుష్పం: ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది. పెళ్లి అయిన వారు మొదటి సంవత్సరం ఈ పూలతో పూజిస్తే అందమైన సంతానం కలుగుతుంది.
- తుమ్మ పూలు: ఈశ్వరునికి పూజ చేస్తే ...దేవునిపై భక్తి అధికం అవుతుంది.. కష్టాలు తీరతాయి
- నందివర్ధనం పూలు: శివునికి పూజ చేస్తే ....జీవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లభిస్తాయి.
- కణగాలే పుష్పం : ఈ పూలతో దేవునికి పూజ చేస్తే మనస్సును పట్టి పీడిస్తున్న భయం ,భీతి తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .విద్య ప్రాప్తి సిద్దిస్తుంది .దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది
- అశోక పుష్పాలు: ఈ పూలతో అమ్మవారికి పూజ చేస్తే ....జీవితం ,సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి
- నల్ల కలువ పుష్పాలు శని భగవానుడికి ఈ పూలతో పూజా చేస్తే అన్ని రకాల శనిసమస్స్యలు తొలగిపోతాయి
- పాదరి పుష్పం : ఈ పుష్పంతో పూజ వలన అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి
- మాలతి పుష్పం : ఈ పూలతో దేవునికి పూజ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి
- పన్నాగ పుష్పం: ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణకు..,శ్రీ గోపాల కృష్ణుదేవునికి పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది .
- వకుళ పుష్పం: శ్రీ భువరాహ స్వామికి ,శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం కలుగుతుంది
- ఉత్ఫల పుష్పం: జీవితంలో చాల కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం ...మహాలక్ష్మి సహస్ర నామం చేప్పుకొని ఉత్ఫల పుష్ఫంతో పూజ చేస్తే జీవితంలో చాల అభివృద్ధి చెందుతారు
- తెల్లని జిల్లేడు పువ్వు: ఈ పువ్వుతో గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.
- ద్రోణ పుష్పం: ఈ పువ్వును సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే శత్రువుల నాశనం ,మిత్రలాభంతో పాటు అధికారం ప్రాప్తిస్తుంది
- భందూక పుష్పం: ఈ పుష్పంతో దుర్గా దేవికి మంగళవారం ...శుక్రవారం పూజ చేస్తే బంధువులు క్షేమంగా ఉంటారు
- అగసి పువ్వు: అమ్మవారికి దేవికి పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి
- సురభి పుష్పం : శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజిస్తే కోరికలు సిద్ధిస్తాయి.
- పొద్దు తిరుగుడు పుష్పం : ఈ పువ్వును హోమం పూర్ణహుతిలో వేస్తె అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
