Good Health :  ఓట్స్ మిల్క్.. ఎముకలకు గట్టి బలం..

Good Health :  ఓట్స్ మిల్క్.. ఎముకలకు గట్టి బలం..

ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ హెల్టీ రెసిపీల్లో ఒక ఒకటి ఓట్స్ మిల్క్. ఎక్కువ ఫైబర్ తోపాటు, న్యూట్రియెంట్స్ ఉన్న ఓట్స్ నుంచి 'ఓట్స్ మిల్క్' తయారు చేస్తారు. ఓట్స్​ను నీళ్లలో నానబెట్టి, తర్వాత జ్యూసీగా ఉండేలా గ్రైండ్ చేస్తారు. ఈ జ్యూస్​ ను  వడకట్టి, పల్స్​ ను తీసేసి, చిక్కగా ఉండే మిశ్రమాన్ని తీస్తారు. దీన్నే ఓట్స్ మిల్క్ అంటారు. ఈ లిక్విడ్ చాలా థిక్​ గా, క్రీమిగా ఉంటుంది. చూడ్డానికే కాకుండా, రుచిలో కూడా మామూలు పాలలాగానే  కొన్ని రకాల కాఫీ డ్రింక్స్ తయారు చేసుకోవడానికి ఈ పాలు బెస్ట్ ఆప్షన్. కొన్ని రకాల  బేకరీ ఐటమ్స్, ఫుడ్ తయారీలో కూడా ఓట్స్​ మిల్క్​ వాడుకోవచ్చు.

 మామూలు పాలకు బదులు అప్పుడప్పుడు ఈ పాలను వాడుకోవచ్చు. ఈ పాలల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. ఇది 'డైరీ ఫ్రీ' కాబట్టి, డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉంటూ, వెగాన్ డైట్ ఫాలో అయ్యేవాళ్లు ఓట్స్ మిల్క్ తీసుకోవచ్చు. దీనిలో అలర్జీ లక్షణాలు చాలా తక్కువ. నట్స్ పడని వాళ్లు కూడా ఆల్మండ్ మిల్క్ బదులుగా ఈ మిల్క్ తాగొచ్చు. అయితే, ఓట్స్​ తో  పోలిస్తే, ఓట్స్ మిల్క్ లో కొంత న్యూట్రియెంట్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇవి కూడా హెల్దీయే. ఈ మిల్క్ రెగ్యులర్​ గా తాగితే, బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.