ప్రతిరోజు తలనొప్పి వస్తోందా ? అసలు కారణం మీ కళ్లే కావచ్చు!

ప్రతిరోజు తలనొప్పి వస్తోందా ? అసలు కారణం మీ కళ్లే  కావచ్చు!

చాలామంది తలనొప్పి రాగానే అది పని ఒత్తిడి వల్లనో, సరిగ్గా నిద్రలేకపోవడం వల్లనో అనుకుంటారు. కానీ, మనం ప్రతిసారి  నిర్లక్ష్యం చేసే మన కళ్లు కూడా ఈ తలనొప్పికి ప్రధాన కారణం కావచ్చు. ఈ కాలంలో గంటల తరబడి ఫోన్, లాప్‌టాప్ చూస్తూ గడపడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోంది.

కళ్ల వల్ల తలనొప్పి 
మన కళ్లు ఏదైనా విషయాన్ని స్పష్టంగా చూడటానికి సాధారణ కంటే ఎక్కువ శ్రమించాల్సి వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి కాస్తా తలనొప్పిగా మారుతుంది. ముఖ్యంగా మీ కళ్ల సైట్ మారినప్పుడు, ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్లను చూస్తూ కళ్లు ఆర్పడం మర్చిపోయినప్పుడు, కంటి కండరాలు బిగుసుకుపోయి  దృష్టి కేంద్రీకరించడం కష్టమైనప్పుడు....

గమనించాల్సిన  లక్షణాలు 
మీ తలనొప్పి కంటి సమస్య వల్లనే వస్తోందని చెప్పడానికి కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. వస్తువులు సరిగ్గా కనిపించకపోవడం లేదా కళ్లు మసకగా అనిపించడం, కళ్లు ఎర్రబడటం లేదా లోపల ఏదో నలుసు పడ్డట్టు అసౌకర్యంగా ఉండటం, వెలుతురును చూసినప్పుడు కళ్లు జిగేల్మనడం లేదా నొప్పి రావడం, ఏదైనా చదివేటప్పుడు లేదా చూసేటప్పుడు కళ్లను చిన్నవిగా చేసి చూడటం, కళ్ల చుట్టూ లేదా నుదుటి భాగంలో భారంగా ఉండటం అనిపిస్తే వెంటనే జాగ్రత్త వహించండి. 

►ALSO READ | ఆధ్యాత్మికం:   దేవుడికి పూల పూజ  .. ఏ పువ్వు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసా..!

మనం ఫోన్లు, కంప్యూటర్లు వాడేటప్పుడు కనురెప్పలు వేయడం తగ్గిస్తాం. దీనివల్ల కళ్లు పొడిబారి 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' అనే సమస్య వస్తుంది. ఇది మెల్లిగా రోజూ వచ్చే తలనొప్పికి దారితీస్తుంది. కొన్నిసార్లు రెండు కళ్లు కలిసి ఒకే దానిపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడతాయి. మెదడు ఈ రెండు కళ్ల నుంచి వచ్చే సమాచారాన్ని కలపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల  కూడా పదే పదే తలనొప్పి వస్తుంటుంది. ప్రతి తలనొప్పికి మాత్రలు వేసుకోవడం కంటే, ఒక్కసారి కంటి పరీక్ష చేయించుకోవడం మంచిది. చాలా సందర్భాల్లో సరైన కళ్లద్దాలు వాడటం లేదా స్క్రీన్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.