ఇంట్లో పనిచేస్తుండగా..మహిళపై దాడి చేసి పుస్తెల తాడు చోరీ

 ఇంట్లో పనిచేస్తుండగా..మహిళపై దాడి చేసి పుస్తెల తాడు చోరీ

చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు.  ఈ మధ్య ఒంటరి మహిళలు, ఇంట్లో ఉంటున్న వృద్ధులను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు దొంగలు.

 లేటెస్ట్ గా  జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో జనవరి 24న ఉదయం తెల్లవారుజామున ఇంటి ముందు పని చేస్తున్న  కోట లక్ష్మి అనే మహిళపై దాడి చేసి మూడు తులాల చైన్ ఎత్తుకెళ్లాడు దొంగ.  గుర్తు తెలియని దుండగుడు తనపై దాడి చేసి సుమారు మూడు తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడని మహిళ తెలిపింది. 

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  గత వారం రోజుల్లో  పట్టణంలో ఇద్దరు మహిళలపై దాడి చేసి చైన్స్ స్నాచింగ్ కు పాల్పడ్డారు దొంగలు. దీంతో మహిళలు  భయాందోళనకు గురవుతున్నారు.

 రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. యాలాల మండలంలోని రాస్నం గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు గోపాల్ రెడ్డి, కమల బైక్​పై తాండూర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, విశ్వనాథ్​పూర్ గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు బైక్​పై వచ్చి పోలీసులమని వారిని అడ్డగించి మాటల్లో పెట్టారు.  ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు మరో బైక్​పై వచ్చి కమల మెడలోని 5 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు.