
కరీంనగర్ క్రైమ్ , వెలుగు: తన పెండ్లి కోసం కుటుంబసభ్యులు అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ నగరంలోని బోయవాడకు చెందిన కొవ్వూరి ధరణి(21) ఇంటర్ వరకు చదివింది. ఆమెకు మూడు నెలల కింద జగిత్యాల జిల్లా రాయికల్ మండలకేంద్రానికి చెందిన యువకుడితో ఎంగేజ్‌మెంట్ అయింది.
పెళ్లి ఆగస్టులో ఉండగా, కుటుంబ సభ్యులు పెండ్లికి అవసరమైన వస్తువులు కొనిపెట్టారు. ఇంకా కొంత డబ్బు అవసరం ఉండగా అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. యువతి తల్లి శనివారం డబ్బు కోసం పెద్దపల్లికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే రోజు రాత్రి యువతి ఉరేసుకుంది. తల్లి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో యువతి ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమంది. ఫ్రెండ్ వెళ్లి చూడగా ధరణి ఇంట్లో ఉరేసుకొని చనిపోయి ఉంది. తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.