హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో.. మృత్యువు వెంటాడం అంటే ఇదే కావొచ్చు.. తండ్రి అస్థికలు గంగలో కలిపి వస్తుండగా వాగులో గల్లంతై కూతురు మృతి చెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం దగ్గర చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం నెర్రెపల్లి గ్రామంలోని అమ్మగారింటి నుంచి భర్తతో కలిసి కృష్ణవేణి అనే మహిళ భువనగిరికి బయలుదేరింది. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం పెద్ద వాగులో భార్యభర్తలు గల్లంతయ్యారు. బైక్పై వాగు దాటుతుండగా నీటి ప్రవాహానికి భార్యాభర్తలు ఇద్దరు వాగులో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో కృష్ణవేణి మృతి చెందగా.. ఆమె భర్తను స్థానికులు రక్షించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
►ALSO READ | ఓ మై గాడ్.. వంటల్లో ఈ నూనె వాడితే జాగ్రత్త.. రిఫైండ్ ఆయిల్ను పల్లీ నూనెగా అమ్ముతున్నారు..!
చనిపోయిన కృష్ణవేణి నెర్రెపల్లి మాజీ సర్పంచ్ తిరందాస్ రవీందర్ కూతురు. గత శనివారమే అనారోగ్యంతో రవీందర్ మృతి చెందారు. ఈ క్రమంలోనే తండ్రి అస్థికలు గంగలో కలపడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో కృష్ణవేణి మరణించింది. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకూతుళ్ల మృతితో నెర్రెపల్లిలో విషాదచాయలు విషాదచాయలు అలుముకున్నాయి. తండ్రి చనిపోయి వారం తిరగముందే కూతురు మరణించడంతో రవీందర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
