ఓ మై గాడ్.. వంటల్లో ఈ నూనె వాడితే జాగ్రత్త.. రిఫైండ్ ఆయిల్ను పల్లీ నూనెగా అమ్ముతున్నారు..!

ఓ మై గాడ్.. వంటల్లో ఈ నూనె వాడితే జాగ్రత్త.. రిఫైండ్ ఆయిల్ను పల్లీ నూనెగా అమ్ముతున్నారు..!

కర్రీ చేసుకోవాలన్నా.. ఏదైనా ఫ్రై చేసుకోవాన్నా.. చివరికి అప్పడాలు వేయించుకోవాలన్నా.. ఇలా వంటకం చేసుకోవాల్సి వచ్చినా నూనె లేనిది కిచెన్ లో స్టవ్ వెలగదు. అలాంటి నూనె కల్తీ అవుతుందని విడిగా కాకుండా బ్రాండెడ్ కంపెనీల నూనెలు వాడుతుంటాం. కంపెనీ లేబుల్, హాల్ మార్క్, ఇంగ్రీడియెంట్స్.. ఇలా అన్ని డీటెయిల్స్ చూసి కనేందుకు ఎక్కువ శాతం జనాలు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ ఏం లాభం.. కొన్ని కంపెనీలో లేబుల్ పైన ఉన్న నూనె ఒకటి.. లోపల ఉన్న నూనె ఒకటి అన్నట్లుగా కల్తీ చేసి అమ్ముతున్నాయి. గురువారం (అక్టోబర్ 30) ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన రైడ్స్ లో రిఫైన్డ్ ఆయిల్ ను పల్లీ నూనెగా మార్కెటింగ్ చేసి అమ్ముతుండటం షాకింగ్ కు గురిచేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి శివారులోని వైదేహి ఆగ్రో ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి. లేబుల్ లో సరైన వివరాలు లేకపోవడం, లేనిది ఉన్నట్లుగా ప్యాకింగ్ పై చిత్రించి మార్కెట్ లో అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించారు. 

కంపెనీ రిఫైన్డ్ ఆయిల్ లేబుల్ పై పల్లి నూనెగా  బొమ్మలు వాడినట్లు  అధికారులు గుర్తించారు. పల్లీ నూనెగా జనాలను తప్పుదోవ పట్టిస్తూ క్యాష్ చేసుకుంటున్నట్లు గుర్తించిన అధికారులు.. 16 వందల లీటర్ల ఆయిల్ సీజ్ చేసి ల్యాబ్ కు తరలించారు. 4 వేల800 కేజీల ఫిలిమ్ ను సీజ్ చేశారు. 

కంపెనీ మార్కింగ్ నుంచి ఆకస్మిక తనిఖీకి కంపెనీ లోకి వెళ్ళడానికి ప్రయత్నించిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి కి కంపెనీ యాజమాన్యం  సహకరింలేదు కదా బెదిరింపులకు దిగినట్లు అధికారులు చెప్పారు. మార్కింగ్  లోపలికి వస్తే మీపైనే కేసులు పెడతామని అధికారులనే బెదిరించింది యాజమాన్యం. యాజమాన్యం బెదిరింపులతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతిర్మయికి సమాచారం ఇవ్వడంతో ఆమె రంగంలోకి దిగారు.  ఆమె వచ్చిన తరువాత అధికారులను లోపలికి అనుమతించింది యాజమాన్యం. నిబంధనలు పాటించకుండా రిఫైండ్ అయిల్ ను పల్లీ నూనెగా వాడుతుండటంపై ఆగ్రహించిన అధికారులు.. ఆయిల్ ను సీజ్ చేసి ల్యాబ్ కు తరలించారు. 


రిఫైండ్ ఆయిల్ అంటే ఏంటి..?

రిఫైండ్ ఆయిల్ అంటే వివిధ దశలలో (మల్టీ స్టెప్) ప్రాసెసింగ్ చేస్తారు. నూనెలో ఉండే మలినాలు, కలర్, స్మెల్, ఇతర అవసరం లేని పదార్థాలను తొలగించేందుకు ప్రాసెసింగ్ చేస్తారు. నూనెను ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. అదే విధంగా ఎక్కువ వేడిని తట్టుకునేలా తయారు చేస్తారు. అంటే డీప్ ఫ్రైస్, చాలా సేపు వేడి చేసిన తట్టుకునేలా తయారు చేస్తారు. ఇందులో కెమికల్స్ కలపడం, బ్లీచింగ్ ప్రాసె వంటి పద్ధతులు ఉంటాయి. దీని కారణంగా న్యాచురల్ గా ఉండే న్యూట్రియెంట్స్ రిఫైన్డ్ ఆయిల్ లో మిస్ అవుతుంటాయి. 

మరోవైపు పల్లీ నూనె కోల్డ్ ప్రెస్ ప్రాసెల్ లో తయారు చేస్తుంటారు. ఇందులో విటమిన్ ఈ, నాచురల్ ఫాట్స్ మొదలైనవి ఉంటాయి. ఇది తక్కువ హీట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ సేపు వేడి  చేయకూడదు.