జూబ్లీహిల్స్ రహమత్ నగర్లో పేలిన సిలిండర్..మహిళ మృతి

జూబ్లీహిల్స్ రహమత్ నగర్లో పేలిన సిలిండర్..మహిళ మృతి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని రహమత్ నగర్లో సిలిండర్ పేలింది.  ఈ  ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో  సోను సింగ్( 36) అనే మహిళకు  తీవ్ర గాయాలై   మృతి చెందింది. మరో  వ్యక్తి గోపాల్ సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే   స్థానిక ప్రవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మృతి చెందిన సోను మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  మధురా నగర్   పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సిలిండర్ పేలిన ఘటనా స్థలాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గాయాలైన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.  మృతి చెందిన సోను కుటుంబానికి తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు నవీన్ యాదవ్ .