
న్యూఢిల్లీ-రాజ్‌గిర్ శ్రమజీవి ఎక్స్‌ప్రెస్ కోచ్‌లోని టాయిలెట్‌లో 2023 సెప్టెంబర్ 01 శుక్రవారం రోజున ఓ 25 ఏళ్ల మహిళ శవమై కనిపించింది. రాజ్‌గిర్ రైల్వే స్టేషన్‌లో మహిళ మృతదేహాన్ని టాయిలెట్ శుభ్రపరిచే సిబ్బంది గుర్తించారు.
వెంటనే వారు జీఆర్పీ, ఆర్పీఎఫ్‌లకు సమాచారం అందించారు. టాయిలెట్ లోపల కమోడ్‌పై కూర్చున్న స్థితిలో మహిళ మృతదేహం కనుగొనబడింది. పోలీసులు సంఘటనా స్థలానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
ALSO READ:సెప్టెంబర్ 8న నవ్వించే తురుమ్ ఖాన్‌లు
ఆమెను ఎవరో హత్య చేశారని, దీనిని ఆత్మహత్యగా చిత్రికరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నామని తెలిపారు. మహిళ ఎవరో ఇంకా గుర్తించలేదన్న పోలీసులు... ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.