పెండ్లి పేరుతోసైబర్ మోసం.. మహిళ నుంచి రూ.3.38 లక్షలు కొట్టేసిన చీటర్స్

పెండ్లి పేరుతోసైబర్ మోసం..  మహిళ నుంచి రూ.3.38 లక్షలు కొట్టేసిన చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు: పెళ్లి పేరుతో నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ చీటర్​ మోసగించాడు. సైదాబాద్ ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల మహిళకు మ్యాట్రిమోని సైట్ ద్వారా హీరాద్ అహ్మద్ పేరుతో స్కామర్​ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. యూకేలో తాను డాక్టర్ అని నమ్మించాడు. కొద్దీ రోజులు మహిళతో వాట్సాప్ కాల్స్, మెసేజెస్, వీడియో కాల్స్​ చేశాడు. బాధిత మహిళతో రెండు బ్యాంక్ అకౌంట్లు, రెండు కొత్త సిమ్ కార్డులు, పాస్ బుక్స్, ఏటీఎమ్ కార్డులను ఢిల్లీలోని నకిలీ యూకే వ్యవహారాల కార్యాలయానికి కొరియర్ చేయించాడు. 

అనంతరం ఇండియా వస్తున్నట్లు చెప్పి అతని స్నేహితులకు నకిలీ వీసాలు, వివాహానికి సంబంధించిన డాక్యుమెంట్లు పంపించాడు. వీసా చార్జెస్ , హోటల్స్ బుకింగ్​ చార్జెస్, ఫ్లైట్ టికెట్స్ అంటూ పలు కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3,38,200 బదిలీ చేయించుకున్నారు. తరువాత మహిళ నంబర్ ను బ్లాక్ చేయడంతో మోసపోయానని గ్రహించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.