అత్తగారింటి ముందు కోడలు దీక్ష

అత్తగారింటి ముందు కోడలు దీక్ష

ఖమ్మం టౌన్, వెలుగు : ‘నా భర్త నాకు కావాలి. ఆయన్నుంచి నన్ను, నా బిడ్డను దూరం చేస్తూ అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారు’ అని ఖమ్మం సిటీ  రోటరీనగర్ కు చెందిన పొదిలా సునీత(28) తన మూడేండ్ల బిడ్డతో కలిసి అత్తగారింటి ముందు బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. మధిర నియోజకవర్గం నాగవరపుపాడుకు చెందిన సునీతకు ఐదేండ్ల కింద ఖమ్మం రోటరీనగర్ కు చెందిన పొదిలా భీమేశ్ ​నారాయణతో పెండ్లయ్యింది. కట్నం కింద రెండెకరాల పొలం, రూ.10 లక్షలు ఇచ్చారు. వీరికి నివిక నారాయణ అనే మూడేండ్ల పాప ఉంది. ఏడాదిన్నర నుంచి అత్తమామలు తనను వేధిస్తున్నారని, తన భర్తకు మరో పెండ్లి చేయాలని చూస్తున్నారని వాపోయింది. అప్పటినుంచి తల్లి దండ్రుల ఇంట్లోనే ఉంటున్నానని, పీఎస్​లో కంప్లయింట్ ​చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చారని, కలిసి ఉండాలని చెప్పినా వినడం లేదన్నారు. రెండు రోజుల నుంచి దీక్ష చేస్తున్నప్పటికీ పోలీసులు వచ్చి పోతున్నారే తప్ప న్యాయం చేయడం  లేదన్నారు.