
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. రైల్లో ఓ మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన స్నేహితుడితో కలిసి లాడ్జికి తీసుకెళ్లి ఆ మహిళను అత్యాచారం చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పూజ అనే మహిళ ఉపాధి కొరకు మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు రైల్లో వస్తుండగా.. వివేకానంద అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగగానే తన స్నేహితుడు (రాజు)కి ఫోన్ చేసి కారు తెప్పించాడు. ఇద్దరు కలిసి మహిళను రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణ లాడ్జికి తీసుకెల్లి అత్యాచారం చేశారు. దీంతో ఆ బాధిత మహిళ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో వివేకానంద, రాజులపై 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
see more news