
యాదాద్రి జిల్లాలో హాజీపూర్ ఘటన మరవకముందే మరో దారుణం జరిగింది. తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో ఒంటరి మహిళను దుండగులు పాశవికంగా హతమార్చారు. కర్రే అనురాధ అనే మహిళ స్థానికంగా బెల్టు షాప్ నిర్వహిస్తోంది. అర్థరాత్రి వేళ దుండగులు అనురాధ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేసి, హతమార్చారు. ఇంట్లోని నగలు, నగదు దోచుకు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ …ఆధారాలు సేకరిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.