యూపీ దారుణం: కంప్లైంట్ వెనక్కి తీసుకోలేదని మహిళపై కాల్పులు..

యూపీ దారుణం: కంప్లైంట్ వెనక్కి తీసుకోలేదని మహిళపై కాల్పులు..

తనపై ఇచ్చిన కంప్లైంట్ ను వాపసు తీసుకునేందుకు నిరాకరించిన మహిళపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురిలో జిల్లాలో జరిగింది. బాధితురాలు ఓ సైబర్ కేసులో నిందితుడు పై కేసు పెట్టింది. బెయిల్ పై వచ్చిన నిందితుడి ఆమె కేసు విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాుడ. అయినా ఆమె ఒప్పుకోలేదు.. దీంతో ఆగ్రహించిన నిందితుడు ఆమె తుపాకీతో కాల్పులు జరిపాడు.. 

ఇటీవల మెయిన్ పురిలో జరిగిన ఈ ఘటనలో నకిలీ ఖాతా ద్వారా ఆన్ లైన్ తనను వేధించాడని బాధితురాలు నిందిడిపై కేసు పెట్టింది. ఈ కేసులో నిందితుడు జైలు కూడా వెళ్లాడు. అయితే బెయిల్ పై వచ్చిన నిందితుడు ఆమెను మరోసారి వేధింపులకు గురి చేశారు.. తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బలవంత పెట్టాడు.. అయినా బాధితురాలు ఒప్పుకోకపోవడంతో తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడిపై దాడి చేశారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై మరోసారి కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం బాధితురాలి  ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆస్పత్రితో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.