ఈమె కిందపడితే లేపడానికి ఫైర్ సిబ్బంది వచ్చారు...

ఈమె  కిందపడితే లేపడానికి ఫైర్ సిబ్బంది వచ్చారు...

రెస్క్యూ టీంలు సాధారణంగా విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి అనేక విధాలుగా సాయపడుతుంటారు.  ఎవరైనా ఒకరికో..ఇద్దరికో వ్యక్తిగతంగా కష్టం వస్తే వారే ప్రత్యమ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.  కాని  మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఓ మహిళ కింద పడితే లేపడానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చారు.

మహారాష్ట్రలో  విచిత్ర సంఘటన జరిగింది.  ఎవరైనా మంచం మీద నుంచి పడితే సాధరణంగా వారికి వారే పైకి లేస్తారు.  లేదంటే  కుటుంబసభ్యులు వచ్చి పైకి లేపుతారు.  కాని  థానేలో ఓ మహిళ కింద పడితే ఆమెను పైకి లేపడానికి  కుటుంబసభ్యులు అగ్నిమాపక సిబ్బందికి ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళ్తే...

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఓ మ‌హిళ‌.. ప్రమాద‌వ‌శాత్తు మంచం మీద నుంచి కింద ప‌డిపోయింది. దీంతో ఆమెను మంచంపై ఉంచేందుకు అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయాన్ని ఆమె కుటుంబ స‌భ్యులు కోరారు. ఎందుకంటే బాధిత మ‌హిళ 160 కిలోల బరువు ఉండ‌ట‌మే కార‌ణం.  కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మంచంపై నిద్రిస్తున్న ఆమె ప్రమాద‌వ‌శాత్తు కింద ప‌డిపోయింది. దీంతో ఆమెను పైకి లేపి మంచంపై ప‌డుకోబెట్టేందుకు కుటుంబ స‌భ్యుల‌కు కష్టమైంది. చేసేదేమీ లేక థానే అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయం కోరాల్సి వ‌చ్చింది.

ALSO READ : వన్డే ప్రపంచ కప్ జట్టుని ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగు కుర్రాడికి చోటు

అగ్నిమాప‌క సిబ్బంది ఆ ఇంటికి చేరుకుని, కింద ప‌డ్డ మ‌హిళ‌ను మంచంపై ప‌డుకోబెట్టారు. బాధితురాలికి ఎలాంటి గాయాలు కాలేద‌ని, ప్రస్తుతం ఆమె నిల‌క‌డ‌గానే ఉన్నార‌ని అధికారులు పేర్కొన్నారు. అయితే త‌మ‌కు ఎన్నో ఎమ‌ర్జెన్సీ కాల్స్ వ‌స్తుంటాయి. కానీ ఇలాంటి కాల్ రావ‌డం అసాధార‌ణం అని పేర్కొన్నారు.