మేడిపల్లి, వెలుగు: గుడికి వచ్చిన మహిళను ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా డబ్బులు దోచుకున్న వ్యక్తిపై మేడిపల్లి పీఎస్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. 2024లో అనారోగ్యంతో ఓ మహిళ ఉప్పల్ బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లింది. అక్కడ ఆలయ పనులు చూసుకునే పానుగంటి గుణకర్ (36) ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.
ఆమె మొబైల్, ఐడీ ప్రూఫ్లతో రూ. 50 వేల లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత 13.5 గ్రాముల బంగారాన్ని తీసుకొని అందులోని కొంత తన అవసరాలకు వాడుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు పెండ్లి చేసుకోమని కోరగా, కులం పేరుతో తిరస్కరించడమే కాకుండా, డబ్బులు తిరిగి అడిగితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
