
ఉత్తరప్రదేశ్‌లోని కౌసంబి జిల్లాలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. శవ వాహనం లేకపోవడంతో ఒక మహిళ మృతదేహాన్ని బైకుపై శ్మశానవాటికకు తీసుకెళ్తుండడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మృతదేహాన్ని బైక్‌పై శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా ఒక వ్యక్తి ఇదంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ వీడియోను షేర్ చేస్తూ, దీనికంటే సిగ్గుచేటు ఏముంటుంది. ముఖ్యమంత్రికి లేదా ఆరోగ్య మంత్రికి చెప్పడానికి ఇంకేమీ లేదు అంటూ అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వాన్ని విమర్శించారు.
సమాచారం ప్రకారం మృతురాలిని బుద్ధరాణిగా గుర్తించగా, ఆమె కౌసంబి జిల్లాలోని మొహబ్బత్‌పూర్ గ్రామానికి చెందినది. ఆమె భర్త, కొడుకు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే బుద్ధరాణి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు ఆమె బంధువులు చెబుతుండగా, పోస్టుమార్టం తర్వాత శవ వాహనం లేకపోవడంతో బుద్ధరాణి మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తున్నారని ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ మధుసూదన్ హుల్గి ఈ విషయంపై దర్యాప్తుకి ఆదేశించారు.
►ALSO READ | అతితెలివి వాడిన అవినీతి ఏఎస్ఐ.. అరెస్ట్ తప్పించుకునేందుకు డబ్బు గాల్లోకి విసిరాడు.. ట్విస్ట్ ఇదే..
భార్య మృతదేహాన్ని బైక్‌పై మోసుకెళ్తూ : నాగ్‌పూర్‌లో కూడా గతంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఒక వ్యక్తి భార్యని ఢీకొనడంతో ఆమె అక్కడిక్కక్కడే మరణించగా, దారిన వెళ్ళే వారి సహాయం లేకపోవడంతో మృతదేహాన్ని బైకుపై వెనక కట్టి తీసుకెళ్లాడు. వెనకాల కారులో వెళ్తున్న కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.