-copy-(1)_e37LMYzPOg.jpg)
ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది శివారులో యువతీ, యువకుల మృతదేహాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వెళ్లిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిని ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌కు గ్రామ వాసులుగా గుర్తించారు.
పంట పొలాల్లో మృతదేహాలు
ఆమెకి 28 ఏళ్లు.. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో భర్తతో విబేధాలు రావడంతో పుట్టింట్లో ఉంటోంది అశ్వని . ఈ క్రమంలో 20 ఏళ్ల కుర్రాడికి దగ్గరైంది.. గత కొతకాలంగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వారిద్దరి హత్య ఒక్కసారిగా కలకలం రేపింది. జంట హత్యల షాకింగ్ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది శివారులోని పొలాల్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు ఆదివారం (ఏప్రిల్ 30) ఉదయం పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ రెండు మృతదేహాలు ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన రెహమాన్ (20), కేఆర్‌కే నగర్‌కు చెందిన అశ్విని (28) గా గుర్తించారు.
3 నెలలుగా పుట్టింట్లోనే..
అశ్విని,రమేష్‌లకు 13ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మనస్పర్థలతో భర్తతో విడిపోయి మూడు నెలలుగా పుట్టింట్లో ఉంటున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు రెహమాన్‌తో వివాహేతర సంబంధం ఉందని.. దీంతోనే ఈ హత్యలు జరిగినట్లుగా పేర్కొంటున్నారు. వీరిద్దరూ ఆదిలాబాద్ నుంచి సీతాగోంది శివారు పంట పొలంలోకి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. వారు పంటపొలాల్లోకి వెళ్లిన తర్వాత హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
భర్తే నిందితుడు
వారిద్దరి తలలపై బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ హత్యలు అశ్విని భర్త రమేష్ తన ఇద్దరు చెల్లెల్లు, బావ సహాయంతో గరకంపేట వద్ద వ్యవసాయ భూమిలో ఇద్దరు (అశ్వని, రెహమాన్) సన్నిహితంగా ఉన్న సమయంలో దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు.