
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నట్లు హన్మ కొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విచారణకు డీజీపీని ఆదేశించారు. ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. తన మీద కోరికతోనే పార్టీలో టికెట్ ఇప్పించానని కోరిక తీర్చాలని ఎమ్మెల్యే తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అయితే సర్పంచ్ నవ్య ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. కొందరు కావాలనే తనపై పనిగట్టుకుని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.