మహిళా కమిషన్​ సీరియస్​ : ఆడవారిని కించపరిచేలా డ్యాన్స్​ లు.. సినీ డైలాగులు

మహిళా కమిషన్​ సీరియస్​ : ఆడవారిని కించపరిచేలా డ్యాన్స్​ లు.. సినీ డైలాగులు
  •  అసభ్య డ్యాన్సులపై మహిళా కమిషన్ సీరియస్
  • మహిళలను కించపరిచేలాఉన్నాయని ఫిర్యాదులు
  • బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఇటీవల విడుదలవుతున్న పలు సినిమా పాటల్లో డాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉంటున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీరియస్​అయ్యింది. సినిమాల్లో డైలాగులు, పాటలు, డాన్సులు, ఇతరత్రా ఏరకంగానైనా మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు, సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.  సినిమాల్లో మహిళలను కించపరిచే పాటలు, డ్యాన్సులు, డైలాగ్​లు ఉంటున్నాయని ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో స్పందించింది. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. 

సమాజానికి సానుకూల సందేశం ఇవ్వడం,  మహిళల గౌరవాన్ని కాపాడడం, సినిమాల నైతిక బాధ్యత అని, యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలియజేయవచ్చునని తెలిపింది. ఈ విషయంపై నిశితం పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషన్ వెల్లడించింది.

అసెంబ్లీ సెషన్ తర్వాత అటెండ్ అవుతా: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హస్తినాపురం కార్పొరేటర్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళ కమిషన్ ఇటీవల నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చినట్లు మహిళ కమిషన్ తెలిపింది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ జరుగుతున్నందున ఈ నెల 27 తరువాత హాజరవుతానని వివరణలో సుధీర్ రెడ్డి పేర్కొన్నారని కమిషన్ వర్గాలు వెల్లడించాయి.