న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ హాకీ టీమ్ కోచ్ పదవికి జానెక్ స్కోప్‌మన్ శుక్రవారం రాజీనామా చేసింది. నేషనల్ ఫెడరేషన్ తనకు తగిన విలువ, గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది. 2021లో విమెన్స్ టీమ్ కోచ్ పగ్గాలు చేపట్టిన స్కోప్‌మన్ కాంట్రాక్ట్ పారిస్ ఒలింపిక్స్ తర్వాత ముగియాల్సి ఉంది. కానీ ఫెడరేషన్‌తో ఇబ్బందులు ఎదురుకావడంతో ముందుగానే ఆమె పదవి నుంచి తప్పుకుంది.
