
మెదక్ జిల్లాల్లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఐదుగరు కాంగ్రెస్ కౌన్సిలర్లు TRSలో చేరారు. అయితే మంత్రి సభలో మహిళలు, ప్రజలు నిరసన తెలిపారు. మంచి నీళ్లు, అర్హూలకు పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. కౌన్సిలర్లుకు, అధికారులకు తమ సమస్యల్ని చెప్పానా.. ఎవరు పట్టించుకోలేదని వాపోయారు. తనుకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా రావడం లేదని ఓ వృద్దురాలు కంటతడి పెట్టింది.