హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం.శ్రీనివాస్ సోమవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మహిళల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళా బాధితుల పట్ల సానుభూతి, మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.
