పవన్ వ్యాఖ్యల పై వాలంటీర్స్ నిరసన

పవన్ వ్యాఖ్యల పై వాలంటీర్స్ నిరసన

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్  వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి.  గ్రామ పరిధిలో ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఏలూరులో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. వాలంటీర్లు ఒంటరి మహిళల సమాచారం సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్నారని, దీంతో వారి కిడ్నాప్ లు జరుగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు.

 పవన్ కి వ్యతిరేకంగా మహిళ వాలంటీర్లు నిరసన చేపట్టారు. పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని చెప్పులతో కొట్టిన మహిళా వాలంటీర్లు.. చిత్రపటాన్ని కూడా కాల్చి బూడిద చేశారు. వాలంటరీ వ్యవస్థను దూషించిన పవన్ వాలంటరీ లోకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.  దీనిపై వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు.  తమ జోలికిస్తే  తాటతీస్తామని మహిళా వాలంటీర్లు పవన్ ను హెచ్చరించారు.  పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను చెప్పులతో కొడుతూ.. దహనం చేశారు.