మహిళా ఓటర్లు ఎటువైపో!..పార్లమెంట్​ పరిధిలో భారీగా పెరిగిన మహిళా ఓటర్లు

మహిళా ఓటర్లు ఎటువైపో!..పార్లమెంట్​ పరిధిలో భారీగా పెరిగిన మహిళా ఓటర్లు
  •     వారి ఓట్ల కోసం అన్ని పార్టీల ప్రయత్నాలు
  •     మహిళా స్కీములు కలిసి వస్తాయని కాంగ్రెస్​ ఆశలు.. 

మహబూబాబాద్​, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్​ చేయడంలో మహిళా ఓటర్లే కీలకంగా మారుతున్నారు. గతంలో కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఇప్పుడు పెరిగింది. మహబూబాబాద్​, వరంగల్​ పార్లమెంట్​ పరిధిలో మహిళ ఓట్ల శాతం ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకొనే పనిలో అభ్యర్థులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోను మహిళ ఓటింగ్​ శాతమే ఎక్కువగా ఉంది. 

ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్ని మహిళల ఓట్లు పొందడం ఎలా అనేదానే పైనే ఆలోచన చేస్తున్నారు. మహబూబాబాద్​ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎలక్షన్​ సమయంలో 14,68,018 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 15, 28,419 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 745554 పురుషులు, 781339 మంది మహిళా ఓటర్లు, 105 మంది థర్డ్​ జెండర్​ ఓటర్లు ఉన్నారు. వరంగల్​ ఎంపీ పరిధిలో గతంలో 18,08,203 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం మొత్తంగా18,16,543 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 8,92,335, మహిళా ఓటర్లు 9,24,208 మంది ఉన్నారు.

కాంగ్రెస్​కు కలసి వస్తుందా? 

 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హమీలలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, రుణ బీమా పథకం, రూ.10లక్షల వరకు బీమా వంటి స్కీమ్స్, మహలక్ష్మిలో రూ. 500లకే గ్యాస్​ సిలిండర్, ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు, ​రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు, గృహ జ్యోతిలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్​, మహిళ పేరిట రూ.5లక్షలతో ఇందిమ్మ గృహలు వంటి పథకాలు ఆకర్షిస్తున్నాయి. 

దీంతో మహిళా ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఎవరివై వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఉండనున్నాయి.