
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఆయా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అన్నీ రంగాలకు చెందిన ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. వీలున్న వారు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తున్నవారు వర్క్ ఫ్రం హోమ్ అంత ఈజీ కాదని అంటున్నారు. వీడియోల్లో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే వాటిలో ఎక్కువ శాతం నవ్వేంచేవిలా ఉండడంతో. ఆ వీడియోలు చూస్తూ నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.
నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఓ మహిళ ప్రాజెక్ట్ నిమిత్తం వెబ్ కామ్ లో ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడుతుంటుంది. అదే సమయంలో ఆమె భర్త అర్ధ నగ్నంగా వచ్చి ఆమెకు ఏదో ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. సడెన్ గా ఆమె భర్త అర్ధనగ్నంగా రావడంతో కంగారుపడి చేతులతో సైగలు చేస్తుంది. భార్య సైగలతో కంగుతిన్న ఆమె భర్త వెబ్ కామ్ లో కనబడకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో గోడకు గుద్దుకొని మళ్లీ మరో పక్కకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. భర్త అగచాట్లు చూసిన భార్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Gets better every time #COVidiot pic.twitter.com/J1jB5v2s2I
— MANS NOT HOT (@mans_not_hott) March 22, 2020