రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో దళిత బంధు పేరుతో మోసం చేస్తున్నారని గ్రామపంచాయతీ మందు ధర్నా చేశారు మహిళలు. గ్రామంలో దళిత బందు ఎంపిక ఏకపక్షంగా జరిగిందని, కేవలం లీడర్లకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే దళిత బంధు ఇస్తున్నారని రోడ్డెక్కారు గ్రామస్థులు. సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
