రీల్ తెచ్చిన తంటా - చీరకు అంటుకున్న నిప్పు 

రీల్ తెచ్చిన తంటా - చీరకు అంటుకున్న నిప్పు 

సోషల్ మీడియా అడిక్షన్ రోజురోజుకీ ఎక్కువవుతోంది. రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది. రీల్ కోసం స్టంట్ చేస్తుండగా ఒక మహిళ చీరకు నిప్పంటుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. పసుపు రంగు చీరలో ఉన్న మహిళ కాళ్ళకి ఫైర్ క్రాకర్స్ తగిలించుకొని, ఒక పోల్ కి వేలాడుతూ పల్టీ కొట్టే ప్రయత్నం చేయగా ఆమె చీరకు నిప్పంటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shalu Kirar (@shalugymnast)

ఈ వీడియోకి 1.6కోట్ల వ్యూస్, 1.66లక్షల లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో కింద కామెంట్స్ కూడా ఆసక్తిగా ఉన్నాయి. కొంత మంది టేక్ కేర్ అంటూ కామెంట్ చేయగా ఇంకొంత మంది తగిన శాస్తి జరిగింది, పిచ్చి పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. రీల్స్ మాయలో పడి ప్రాణాల మీదకే తెచ్చుకునే రిస్క్ చేయటం మానుకోవాలని కామెంట్స్ చేస్తన్నారు.