Women’s TNPL 2026: వరల్డ్ కప్ ట్రోఫీతో మహిళా క్రికెట్‌లో పెరుగుతున్న ఆదరణ.. తమిళనాడులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

Women’s TNPL 2026: వరల్డ్ కప్ ట్రోఫీతో మహిళా క్రికెట్‌లో పెరుగుతున్న ఆదరణ.. తమిళనాడులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

భారత మహిళల జట్టు  స్వదేశంలో వరల్డ్ కప్ గెలవడంతో ఇండియాలో మహిళా క్రికెట్ కు ఆదరణ పెరుగుతోంది. మహిళా క్రికెట్ ను ఎంకరేజ్ చేస్తూ తమిళనాడు క్రికెట్ ముందుకొచ్చింది. వచ్చే సంవత్సరం తమిళనాడులో మహిళా క్రికెట్ ను ప్రారంభించనున్నారు. తొలిసారి 2026లో ఈ లీగ్ కు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రమంతా తమిళనాడు క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ లీగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. తమిళ నాడు క్రికెట్ అసోసియేషన్ నాలుగు నుంచి ఆరు జట్లతో మొదట ఒక లీగ్ ప్రారంభించాలనే ఐడియాతో ఉంది. 

"తమిళ నాడు ప్రీమియర్ లీగ్ ఖచ్చితంగా పరిశీలనలో ఉంటుంది." అని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) కొత్త అధ్యక్షుడు టీజె  శ్రీనివాసరాజ్ అన్నారు. "ఈ లీగ్ ను పూర్తి స్థాయి తమిళ నాడు ప్రీమియర్ ఈవెంట్‌గా విస్తరించే ముందు మేము మొదట నాలుగు లేదా ఆరు జట్లతో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. లీగ్ మాత్రం ఖచ్చితంగా ప్రణాళికల్లో ఉంది." అని ఆయన అన్నారు. ఆటగాళ్ల వేలం నిర్వహించడానికి కనీసం 500 నుండి 600 మంది నాణ్యమైన ఆటగాళ్లు అవసరమని శ్రీనివాసరాజ్ అన్నారు. కానీ నాలుగు లేదా ఆరు జట్ల లీగ్‌తో ప్రారంభించడానికి ఖచ్చితంగా అవకాశం. తిరువళ్లూరు, కాంచీపురం వంటి జిల్లాల్లో క్రికెట్ ను విస్తరిస్తున్నాం". అని ఆయన అన్నారు.   

తమిళ నాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) కార్యదర్శి యు భగవాన్‌దాస్ రావు మాట్లాడుతూ.. "కొంతకాలంగా మహిళల లీగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మేము ఒక తప్పకుండా ప్రారంభించాలనుకుంటున్నాం. గత రెండు సంవత్సరాలుగా తమిళనాడులో మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతోంది. భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంతో మహిళలకు క్రికెట్ లో ఎక్కువ సపోర్ట్ లభిస్తోంది. మేము మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించాలని చూస్తున్నాము. తమిళనాడులో దాదాపు 150 మెన్స్ క్రికెట్ క్లబ్‌లు ఉన్నప్పటికీ, మహిళల కోసం ఒక్కటి కూడా లేదు". అని శ్రీనివాసరాజ్ అన్నారు.