ఆఫీసుల్లో ఇలా అస్సలు ఉండకూడదు...! షిఫ్ట్ సల్కింగ్లో ఉన్నారా.. వర్క్ ప్లేస్.. బర్న్ అవుట్

ఆఫీసుల్లో ఇలా అస్సలు ఉండకూడదు...! షిఫ్ట్ సల్కింగ్లో ఉన్నారా.. వర్క్ ప్లేస్.. బర్న్ అవుట్

షిఫ్ట్ సల్కింగ్.. ఇదో కొత్త ట్రెండింగ్​ టాపిక్​. ఈ పదాన్ని ఆఫీస్​కి వెళ్లేవాళ్లు వాడుతుంటారు.  ఇంతకీ దీనర్థం ఏంటంటే.. ఒక ఎంప్లాయి తన షిఫ్ట్‌‌‌‌లో ఆఫీసుకు వచ్చేసరికి యాక్టివ్​గా ఉంటే పర్లేదు. కానీ పని మొదలు కాకముందే విసుగుగా ఉంటే ఇంటర్నెట్ దీనికి “షిఫ్ట్ సల్కింగ్” అని పేరు పెట్టింది. 

కొన్నిసార్లు ఉద్యోగులు శారీరకంగా ఆఫీసుకు వస్తారు. కానీ మనస్ఫూర్తిగా రాలేరు. ఆ విసుగు ఇతరులకు కూడా సోకుతుంది. ఇది చాలా వేగంగా వ్యాపించే ట్రెండ్. ఇప్పటికే ఆఫీస్​ల్లో ప్రతి నలుగురిలో ఒకరు షిఫ్ట్​ సల్కింగ్​లో ఉంటున్నారట! మొదట  ఎవరు ఈ పేరు పెట్టారో కచ్చితంగా తెలియదు. కానీ చాలామంది దీన్ని ఫీల్ అవుతున్నారు. దీనికి రిలేట్ అవుతున్నారు. 

వర్క్​ ప్లేస్.. బర్న్​ అవుట్

ఉదయాన్నే ఎవరూ విసుగుగా పని మొదలుపెట్టాలని అనుకోరు. కానీ శరీరం, మనసు ఎక్కువగా అలసిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం వర్క్‌‌‌‌ప్లేస్ బర్న్​ అవుట్. జెన్ – జెడ్​, మిలెనియల్స్ అందరినీ బర్న్​ అవుట్ వేధిస్తోంది. 

ఇది కేవలం నిద్ర లేమి వల్ల కాదు. ‘ఎప్పుడూ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఉండాలి. ల్యాప్‌‌‌‌టాప్ ముందు భోజనం చేయాలి. మీటింగ్ టెన్షన్స్​, పని ఎప్పటికీ అయ్యేలా లేదు’ అనే ఫీలింగ్... ఇవన్నీ కారణాలే. కొందరికి షెడ్యూల్ మారుతూ ఉండటం, సిబ్బంది తక్కువ ఉండటం, ఏం చేయాలో స్పష్టత లేకపోవటం వంటివి ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత స్ట్రెస్ కూడా దీనికి తోడవుతుంది.

ఇది ఎందుకు సోకుతుంది?

ఆఫీసు ఒక ఎకోసిస్టమ్. ఒకరిలో బ్యాటరీ పని చేస్తే ఆ ఎనర్జీ గది మొత్తానికి వ్యాపిస్తుంది. ఒకరు విసుగ్గా కనిపిస్తే ఇతరులు కూడా అలాగే ఫీల్ అవుతారు. దీన్ని “ఎమోషనల్ కంటాజియన్” అంటారు. ఒక్కరి విసుగు టీమ్ మొత్తం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రొడక్టివిటీ తగ్గుతుంది. టీమ్ స్పిరిట్ పడిపోతుంది. ఇలాగే కొనసాగితే షిఫ్ట్ సల్కింగ్ సాధారణం అయిపోతుంది. కల్చర్ మొత్తం టాక్సిక్​గా మారిపోతుంది. 

ఈ రోజుల్లో యువత మానసికంగా స్థిరత్వంగా ఉండడానికి, టార్గెట్లు రీచ్​ అవ్వడానికి ఇష్టపడతారు. ఓవర్‌‌‌‌వర్క్‌‌‌‌ చేయడానికి ఆసక్తి చూపట్లేదు. కానీ ఆఫీసులు మారకపోతే విసుగు పెరుగుతుంది. త్వరగా పరిష్కారం రాదు. కానీ బర్నవుట్‌‌‌‌ను గుర్తించడం, స్పష్టమైన కమ్యూనికేషన్, మంచి వర్క్ ఎన్విరాన్‌‌‌‌మెంట్ ఇవ్వడం ద్వారా మార్పు తీసుకురావచ్చు. ఇది కంపెనీ కల్చర్ సరిగ్గా లేదని చెప్పే సిగ్నల్ కాబట్టి యజమానులు త్వరగా గమనించి సపోర్ట్ ఇవ్వాలి.