కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలోని కావేరి జిన్నింగ్ మిల్లులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన మిలాన్ అనే వలస కార్మికుడు మృతి చెందాడు. ఉదయం మిల్లులో పత్తి జిన్నింగ్ చేస్తుండగా మెషీన్‌లో ఇరుక్కుపోయడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది మెషీన్ నుంచి బయటకు తీసి కరీంనగర్ హాస్పిటల్‌కు తీసుకెళ్తున్న సమయంలో మిలాన్ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని తోటి కార్మికులు మిల్లు యజమానిని డిమాండ్ చేశారు.
