గ్రేటర్ నోయిడా: వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో ఇండియా బాక్సర్లు పవన్ బర్త్వాల్, హితేష్ గులియా సంచలనం సృష్టించారు. సోమవారం (నవంబర్ 17) జరిగిన మెన్స్ 55 కేజీ క్వార్టర్ ఫైనల్లో 5-–0 తేడాతో రెండో సీడ్ అల్తిన్‌బెక్ (కజకిస్తాన్)ను ఓడించాడు.
ఈ విక్టరీతో పవన్ తొలి ఇంటర్నేషనల్ మెడల్ ఖాయం చేసుకున్నాడు. మరోవైపు 70 కేజీ క్వార్టర్ ఫైనల్లో హితేష్ 3–2తో ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, టాప్ సీడ్ అయిన సెవాన్ ఒకాజావాకు షాకిచ్చాడు. సుమిత్ (75 కేజీ), నవీన్ (90 కేజీ), జాదుమణి సింగ్ (50 కేజీలు) కూడా సెమీస్ చేరి పతకాలు ఖాయం చేశారు.
