మార్చ్ 27 నుంచి ప్రపంచ బౌద్ధ శాంతి మహాసభలు

మార్చ్  27 నుంచి ప్రపంచ బౌద్ధ శాంతి మహాసభలు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటే లక్ష్యంతో తెలంగాణ వేదికగా ప్రపంచ బౌద్ధ శాంతి మహాసభల(వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌) నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు నాగార్జున సాగర్‌‌‌‌లోని బుద్ధవనంలో సభలు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా శ్రీలంక బౌద్ధ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ మంత్రి హినిదుమ సునీల్ సెనెవితోపాటు వివిధ దేశాల బౌద్ధ మత ప్రతినిధులు, మేధావులు హాజరు కానున్నారు.

మంత్రి పర్యటన దృష్ట్యా శ్రీలంక హైకమిషన్ అధికారులు ఆయన పర్యటన, భద్రత, వసతి ఏర్పాట్లపై కాన్ఫరెన్స్​నిర్వాహకులను వివరాలు కోరారు. ఈ పర్యటనతో తెలంగాణ-–శ్రీలంక మధ్య సంబంధాలు బలపడతాయని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాల ప్రాశస్త్యాన్ని ఈ సభలు చాటిచెప్పనున్నాయి.