హైదరాబాద్, వెలుగు: వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా రెనోవా సెంచరీ హాస్పిటల్స్, -హార్లీ-డేవిడ్సన్ బంజారా చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్లో ‘కేర్ ఫర్ యువర్ లెగ్స్’ పేరుతో బైక్ ర్యాలీని నిర్వహించారు. వాస్కులర్, డయాబెటిక్ ఫుట్ కేర్ పై అవగాహన కల్పించారు. ఫిట్నెస్ ఔత్సాహికులు, మాసబ్ ట్యాంక్ పోలీసులు సహా వందలాది మంది ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిట్నెస్, ముందస్తు స్క్రీనింగ్, నివారణ ఆరోగ్య సంరక్షణపై సందేశం ఇచ్చారు. రెనోవా హాస్పిటల్ నుంచి ఖాజాగూడ వరకు సాగిన ర్యాలీని డా. సయ్యద్ అమీర్ బాషా పాస్పాల్, రవీంద్రనాథ్ గరగ ప్రారంభించారు.
